ప్రకాశం: కంభం పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం సాయంత్రం పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మార్కాపురం డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారాయణ హాజరయ్యారు. దసరా పండుగను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి గొడవలకు తావులేకుండా జరుపుకోవాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ మతాలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కంభంలో పీస్ కమిటీ సమావేశం


