BDK: దమ్మపేట మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను శనివారం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజు ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించారు. బాధితులకు న్యాయం చేకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
పెట్రోలింగ్ ముమ్మరం చేయాలి: ఎస్పీ


