హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ సెల్ కార్యదర్శిగా ఏడేల్లి కార్తీక్

JN: జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ నూతన కార్యదర్శిగా రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన ఏడేల్లి కార్తీక్ నియమితులయ్యారు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు వేముల మల్లేశ్ మహారాజ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. తనకు బాధ్యత అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన కార్తీక్, ఎస్సీల సంక్షేమం, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.