హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపే భారత్-వెస్టిండీస్ మూడో టీ20

వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఓడిన టీమిండియా.. రేపు ఇండోర్ వేదికగా మూడో టీ20కి సిద్ధమవుతోంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. బ్యాటింగ్ బలంగా ఉన్నా టీమిండియాను బౌలింగ్ కలవరపెడుతోంది. సంజూ శాంసన్ ఫామ్‌లోకి రావడంతో బ్యాటింగ్ విభాగం మరింత బలంగా మారింది. మరోవైపు విండీస్ జట్టును కెప్టెన్ షెయ్ హాప్ నడిపిస్తున్నాడు.