SRCL: తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లిలో MY భారత్ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 130 మంది యువత పాల్గొన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, పునరావాసం, యువత పాత్రపై 4 సెషన్లలో అవగాహన కల్పించారు. సైకాలజిస్ట్ పున్నంచందర్, వలంటీర్‌లోపెల్లి రాజు హాజరయ్యారు. చివరలో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
తెలంగాణ
దేశాయి పల్లెలో మై భారత్ నషా ముక్త్ భారత్


