హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణ అమరవీరులకు బియ్యందానం!

MHBD: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ కేంద్రంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జనసమితి నాయకులు బియ్యం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు.