హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహిత అదృశ్యం.. కేసు నమోదు

NZB: చందూరు గ్రామానికి చెందిన గజ్జి సైదవ్వ అదృశ్యం అయినట్లు ఎస్సై వంశీకృష్ణ శనివారం తెలిపారు. అక్టోబర్ 7న నందిపేట (M)పాల్ గుట్టకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆమె భర్త నర్సింహులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ఆచూకీ తెలిస్తే పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని కోరారు.