హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాడీ బిల్డింగ్‌లో ప్రభాకర్‌కు ప్రథమ స్థానం

GDWL: మాస్టర్ మెన్స్ ఫిజిక్స్ విభాగంలో అయిజకు చెందిన ప్రభాకర్ ప్రతిభ చాటారు. దేశవ్యాప్తంగా వాలార్ క్లాసిక్ నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో 52 ఏళ్ల వయస్సు విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రభాకర్‌ను శాలువాతో సన్మానించారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.