హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సింగ్ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన కార్యక్రమం

WGL: గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లిలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ విధులు, మహిళలు, యువతుల భద్రతకు షీ టీమ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయనే అంశాలపై విద్యార్థులకు వివరించారు. మహిళలు, బాలల భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిర్వాహకులు పేర్కొన్నారు.