హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు 50 బస్తాల సిమెంట్ అందజేత

BHNG: రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ఆపదలో ఉన్న వితంతు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన ఫౌండేషన్ తరఫున 50 బస్తాల ఉచిత సిమెంట్ అందజేశారు. శనివారం బొందుగుల గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఈ సాయాన్ని అందించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.