ATP: ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో తాడిపత్రిలో శనివారం ఆపరేషన్ వజ్ర ప్రహార్‌లో భాగంగా పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. టైలర్స్ కాలనీ, నందలపాడుతో పాటు ఐదు గ్రామాల్లో 90 ఇళ్లను తనిఖీ చేసి 140 మందిని విచారించారు. కార్యక్రమంలో 249 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలు, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కార్డన్ అండ్ సెర్చ్‌లో వాహనాల సీజ్


