NLG: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాతను ప్రతిష్టించాల్సిన స్థలంపై డిండి మండలం శాంతిగూడెంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదం ముదిరింది. చివరకు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించకుండానే నిమజ్జనం చేశారు. స్థల వివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్త చేస్తున్నారు.
తెలంగాణ
ప్రతిష్ఠించకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం


