హైదరాబాద్: 28°C
తెలంగాణ

మన్ననూర్‌లో డిప్యూటీ సీఎం పర్యటన

NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలో ఈ నెల 14వ తేదీన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ వెల్లడించారు. మన్ననూరులో నూతనంగా ఏర్పాటు చేయనున్న 220 కేవీ విద్యుత్ సబ్‌ స్టేషన్‌‌కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేయనున్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.