MNCL: అడవులను, వన్యప్రాణులను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని జన్నారం మండలంలోని మల్యాల అటవీ శాఖ బీట్ ఆఫీసర్ కృష్ణ, ఆదర్శ కళా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లింగంపల్లి రాజలింగం తెలిపారు. శనివారం సాయంత్రం మల్యాల గ్రామంలో ప్రజలకు, వన్యప్రాణులు అడవుల సంరక్షణ, ఉపయోగంపై వారు అవగాహన కల్పించారు. మనిషి జీవితం అడవులు, వన్యప్రాణులపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు.
తెలంగాణ
'వన్యప్రాణులను కాపాడుకుందాం'


