హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువుల కట్టలకు మరమ్మత్తులు

NLG: కొత్తపల్లిలో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా చెరువుల కట్టల వద్ద శుభ్రత, మరమ్మతు పనులు చేపట్టారు. సర్పంచ్ రేణుక రాజు ఆధ్వర్యంలో DVK రహదారిపై గంగాదేవి, అనంతారం దారిపై ముత్యాలమ్మ చెరువు కట్టలపై పిచ్చి మొక్కలను తొలగించి మరమ్మతులు చేయించారు. మహిళలు సంతోషంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.