BPT: అద్దంకి మండలం సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా స్వామివారికి పదివేల అరటి పండ్లతో పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా విజ్ఞేశ్వర పూజ, ఆలయ ప్రదక్షణ, ధ్వజస్తంభం వద్ద పూజల అనంతరం గర్భాలయంలోని స్వామివారికి అరటి పండ్లతో పూజ నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రసన్నాంజనేయ స్వామికి అరటి పండ్లతో పూజ


