JGL: యువత శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు దోహదపడతాయని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం రేచపల్లిలో శనివారం ఎస్‌పీఎల్ సీజన్-4 క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. క్రీడలతో క్రమశిక్షణ, స్నేహభావం పెరుగుతాయని, యువత ప్రతిభను చాటుకోవాలని సూచించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నందయ్య, సర్పంచ్ మహేష్, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
క్రీడలతోనే శారీరక, మానసిక దృఢత్వం


