హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా రోజున మోడల్ కాలనీ ఇండ్ల కేటాయింపు: మంత్రి ఉత్తమ్

SRPT: హుజూర్‌నగర్‌లో రామస్వామి గుట్ట వద్ద నిర్మించిన మోడల్ కాలనీ ఇళ్లను దసరా రోజైన అక్టోబర్ 20న అర్హులకు కేటాయించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ సెక్రటరీ వీపీ గౌతమ్, కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌తో సమీక్షించారు. తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ పనులు వెంటనే పూర్తి చేయాలని, కేటాయింపు పారదర్శకంగా ఉండాలన్నారు.