హైదరాబాద్: 28°C
తెలంగాణ

'దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్రలు'

JGL: దేశ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్రలు చేస్తున్నాయని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసీఎస్ రాజు అన్నారు. జగిత్యాల పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థికంగా, అంతర్జాతీయంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఈ పురోగతిని ఓర్వలేక కొన్ని పార్టీలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు.