హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేతో డీఎస్పీ భేటీ

అనంతపురం నూతన డీఎస్పీ కరుణాకర్ రావు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయనకు సూచించారు. ఎక్కడ రాజీ లేకుండా విధులు నిర్వర్తించి ప్రజలకు మంచి చేయాలన్నారు.