హైదరాబాద్: 28°C
క్రీడలు

నితీశ్‌ రెడ్డికి ఛాన్స్ ఇవ్వాలని డిమాండ్!

రెండో టీ20లో ఓటమి తర్వాత శివమ్ దూబేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటింగ్‌లో ప్రమోషన్ దక్కినా 10 బంతుల్లో కేవలం 7 పరుగులే చేసి నిరాశపరిచాడు. అతడి స్లో ఇన్నింగ్స్ రన్ రేట్‌ను దెబ్బతీసింది. బౌలింగ్‌లోనూ రాణించలేకపోయాడు. దీంతో వరుసగా విఫలమవుతున్న దూబే స్థానంలో నితీశ్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.