హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌తో సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

స్వదేశంలో భారత్‌తో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ విల్ ఓరూర్క్ కాలి కండరాల గాయం కారణంగా టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లన్నింటికీ దూరమయ్యాడు. కివీస్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. DECలో జరిగే ఆస్ట్రేలియా సిరీస్ నాటికి అతడు జట్టులోకి వచ్చే అవకాశం ఉందన్నాడు.