హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంతర్వేది ఆలయంలో కొత్త నిబంధనలు!

కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మోకా నాగవర ప్రసాద్ శనివారం తెలిపారు. ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక సంప్రదాయాలను గౌరవిస్తూ భారతీయ సంప్రదాయ వస్త్రధారణతో స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. నిబంధనలు ఉల్లఘించే వారికి ఆలయ ప్రవేశం ఉండదన్నారు.