హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అహోబిలంలో మహాలయ అమావాస్య పూజలు

NDL: ఆళ్లగడ్డ మండలంలోని అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి  సమేత ప్రహ్లాద వరద స్వామివార్లకు ఆలయముఖ ద్వార మండపంలో కొలువుంచి పంచామృతాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, కర్పూరం వంటి లేపనాలు సమర్పించి ధూప దీపాలతో మహా మంగళహారతి అందించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి, భక్తులకు దర్శనం కల్పించారు.