ప్రకాశం: శింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుతున్న తౌషీక్ మృతిపై తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని MP మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడంలో తన పాత్ర ఉందంటూ MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఆరోపణలను ఖండించారు. యాజమాన్యాన్ని కాపాడాల్సిన అవసరం తనకు లేదని పేర్కొంటూ శనివారం ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నా పై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు'


