హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆళ్లగడ్డలో అభివృద్ధి పనులు ప్రారంభం!

NDL: ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం పర్యటించారు. ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రూ.21 కోట్ల HAM నిధులతో ఎం.వి. నగర్, బృందావన్, వీవర్స్ కాలనీల్లో పలు అభివృద్ధి పనులకు శిలాఫలకాలు ఆవిష్కరించి శ్రీకారం చుట్టారు. పట్టణంలో మెరుగైన రహదారులు, మౌలిక వసతుల కల్పనే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.