హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ 77, జనసేన 32, బీజేపీకి 11?

VSP: జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 120 వార్డుల్లో టీడీపీకి 77, జనసేనకు 32, బీజేపీకి 11 వార్డులు కేటాయించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మేయర్ పదవిని టీడీపీకి కేటాయించడంతో పాటు, డిప్యూటీ మేయర్ పదవిని జనసేన లేదా బీజేపీకి ఇచ్చే అంశంపై కూటమి నేతల మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం.