హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ రైల్వే స్టేషన్‌లో ఉక్కిరిబిక్కిరి

VSP: దసరా ప్రారంభం కావడంతో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. విశాఖ నుంచి విజయవాడ, రాయగడ, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ముఖ్యంగా జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌లలో ప్రయాణికుల తాకిడి అధికంగా కనిపించింది. పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో రైల్వే స్టేషన్‌లో సందడి నెలకొంది.