హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శరన్నవరాత్రులకు సిద్ధమైన కనకదుర్గ ఆలయం

ASR: కొయ్యూరు కొండపై వెలసిన కనకదుర్గ తల్లి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు కలిసి ఆలయాన్ని పూలు, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు.