అన్నమయ్య: వ్యవసాయ బోరు వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. సుండుపల్లి మండలం మాచిరెడ్డిగారిపల్లి పంచాయతీ మిట్టబిడికికి చెందిన రైతు గోబ్రే నాయక్ బోరు వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో రైతుకు నష్టం వాటిల్లింది. విద్యుత్ పరికరాల చోరీలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి కాపర్ వైర్ల చోరీ


