హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ద్వారకాతిరుమల అన్నదాన పథకానికి భారీ విరాళం

ELR: ద్వారకాతిరుమల చినవెంకన్న స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు తూర్పుగోదావరి జిల్లా దూబచర్లకు చెందిన జామి యశ్వంత్ సాయిరామ్ పవన్ రూ.1,01,116 విరాళంగా అందజేశారు. శనివారం స్వామివారి అన్నదాన పథకానికి ఈ మొత్తాన్ని సమర్పించారు. అనంతరం దేవస్థానం అధికారుల నుంచి విరాళానికి సంబంధించిన రశీదును పొందారు. భక్తులకు అన్నదానం అందించే పవిత్ర కార్యక్రమానికి దాత తన వంతు సహకారం అందించారు.