గుమ్మలక్ష్మీపురం మండలం పెదఖేర్జ గ్రామానికి చెందిన వరుణ్ తేజ అనే ఏడో తరగతి విద్యార్థి దసరా సెలవులకు ఇంటికి వచ్చి ప్రమాదానికి గురయ్యాడు. పూల కోసం చెట్టు ఎక్కిన సమయంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో అతని ఎడమ తొడలో కొయ్యముక్క దిగబడింది. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి అతడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బాలుడి తొడలోకి దిగిన కొయ్యముక్క


