హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపటి నుంచి మహలక్ష్మి శరన్నవరాత్రులు ప్రారంభం

WNP: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి మహాలక్ష్మీ శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. రేపు కలశ స్థాపనతో మొదలై 12 నుంచి 20 వరకు ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, రాజ్యలక్ష్మి అలంకారాల్లో అమ్మవారు దర్శనమిస్తారని అర్చకులు గురుస్వామి తెలిపారు.