హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి'

KRNL: ఓర్వకల్లు మండలం పాలకొలనుకు చెందిన రైతులు నకిలీ కుసుమ విత్తనాలతో నష్టపోయామని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డిని కలిసి శనివారం ఫిర్యాదు చేశారు. నందికొట్కూరుకు చెందిన వ్యాపారి విక్రయించిన విత్తనాలు మొలకెత్తలేదని వారు తెలిపారు. తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యేను కోరారు.