హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీలకు జగన్ క్షమాపణ చెప్పాలి'

అన్నమయ్య: బీసీల రాజకీయ ఎదుగుదలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుపడుతున్నారని టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు ఖాదర్ ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరఫున బీసీలకు 34 శాతానికి పైగా టికెట్లు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించడం బీసీల పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న వైసీపీ నాయకులు వారికి క్షమాపణ చెప్పాలన్నారు.