అన్నమయ్య: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో పోలీసులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఓటర్ల భద్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ప్రజలు సహకరించాలని పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల తనిఖీలు


