హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేతనాలు పెంచాలని ఆశావర్కర్ల వినతి

KKD: ఆశా వర్కర్లకు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ  మేరకు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజాకు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాల ఆశావర్కర్లు శనివారం వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం అందుతున్న రూ.10 వేల వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలన్నారు. శిక్షణ పొందిన ఏఎన్ఎం, జీఎన్ఎంలకు శాశ్వత పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.