TPT: జైపూర్‌కు చెందిన ఆర్తి బిందాల్ దంపతులు తిరుమల శ్రీవారికి రూ.51.55 లక్షలు విలువైన 174 గ్రాముల బంగారు లాకెట్, ముత్యాల హారాన్ని విరాళంగా అందించారు. వీటిలో రూ.44.35 లక్షలు విలువైన వజ్రాలు, రత్నాలు పొదిగిన బంగారు లాకెట్, రూ.7.20 లక్షలు విలువైన వజ్రాలు, కెంపులు పొదిగిన ముత్యాల హారాలు ఉన్నాయి. ఈ మేరకు దాత టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడుకు ఆభరణాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారికి రూ.51.55 లక్షలు విలువైన బంగారం విరాళం


