హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రాఫ్ట్ పట్టాదార్ పాస్ పుస్తకాలను పరిశీలించిన ఆర్డీవో

NTR: రెడ్డిగూడెం మండలం కూనపరాజుపర్వ గ్రామంలో రీసర్వే పూర్తయిన నేపథ్యంలో పంపిణీ చేయనున్న డ్రాఫ్ట్ పట్టాదారు పాస్ పుస్తకాలను తిరువూరు ఆర్డీవో ఎ. కుమార్ పరిశీలించారు. రైతులు తమ పేర్లు, భూమి విస్తీర్ణం, ఆధార్ వివరాలను క్షుణ్ణంగా సరిచూసుకోవాలని సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలని కోరారు.