హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలకు రోటరీ క్లబ్ ఫర్నిచర్ వితరణ

W.G: భీమవరం మౌలానా అబ్దుల్ కలామ్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సుమారు రూ. 35 వేల విలువైన టేబుల్స్, కుర్చీలను అందించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి చేయూతనందించాలనే లక్ష్యంతో ఈ ఫర్నిచర్‌ను అందించినట్లు క్లబ్ అధ్యక్షుడు గిరి తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు రోటరీ క్లబ్ నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.