హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా సెలవులు.. ఎస్సై సూచనలు ఇవే!

KDP: దసరా సెలవులకు ఊరికి వెళ్లేవారు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని కమలాపురం ఎస్సై శ్రీనివాసులు సూచించారు. ప్రయాణ సమయంలో బంగారు ఆభరణాలు, నగదు విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు స్థానికులు, బంధువులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తలుపులు, కిటికీలు సరిగా మూసి తాళాలు వేసుకోవాలని సూచించారు.