హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గఫూర్ కుమారుడు అమెరికాలో మృతి

కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత ఎంఏ గఫూర్ కుమారుడు కిరణ్ (41) అమెరికాలోని శాన్‌జోస్‌లో గుండెపోటుతో మృతి చెందారు. అక్టోబర్ 1నే ఆయన చనిపోయారు. పది రోజులుగా సమాచారం లేక తల్లిదండ్రులు తెలుగు సంఘాలను ఆశ్రయించగా, ఆమన, తానా ప్రతినిధులు మరణాన్ని ధ్రువీకరించారు. కిరణ్ పేపాల్‌లో సీనియర్ డేటా సైంటిస్ట్‌. మృతదేహం కర్నూల్‌కు చేరేందుకు వారం పట్టొచ్చు.