హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారి ఉత్సవాలకు వెంకయ్య నాయుడుకు ఆహ్వానం

కృష్ణా: సొసైటీపేటలోని శ్రీ గాయత్రి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 11-20వ తేదీ వరకు నిర్వహించనున్న శరన్నవరాత్రి మహోత్సవాలకు మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడును ఆహ్వానించారు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్‌లో ఆయనకు ఛైర్మన్ కేవీఆర్ కిశోర్, నాదెండ్ల మోహన్ ఆహ్వాన పత్రిక అందజేశారు. దేవస్థాన కమిటీ, గన్నవరం బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు.