హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జూడోలో సత్తా చాటిన గన్నవరం విద్యార్థిని

కృష్ణా: గన్నవరానికి చెందిన మానికొండ సాయి సత్య చిన్మయి రాష్ట్ర స్థాయి అండర్‌-19 జూడో పోటీలకు ఎంపికైంది. జిల్లా స్థాయి పోటీల్లో 70 కిలోల విభాగంలో అర్హత సాధించినట్లు డీఎస్‌ఏ కోచ్‌ శ్రీను తెలిపారు. ఈనెల 12 - 14 వరకు తిరుపతిలో పోటీలు జరగనున్నాయి. ఇంటర్‌ చదువుతున్న చిన్మయి గతంలో జూడో, ఫెన్సింగ్‌, టైక్వాండో, కూరష్‌ క్రీడల్లో జాతీయ స్థాయిలో పాల్గొన్నారు.