హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

23 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

CTR: యాదమరి మండలం పెరియంబాడి గ్రామంలో పోలీసులు నిర్వహించిన కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌లో సరైన ధ్రువపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించి, అనుమానితుల వివరాలను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామన్నారు.