KRNL: కుప్పగల్–కోసిగి రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు కింద పడి గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందారు. ఆమె వయస్సు సుమారు 75 ఏళ్లు ఉంటుందని, ఎడమ భుజం, ఛాతీపై పుట్టుమచ్చలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఆకుపచ్చ చీర, నల్ల జాకెట్, రోజ్–పసుపు రంగు టీషర్ట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు. ఆమె వివరాలు తెలిసిన వారు ఆదోని రైల్వే పోలీసులను సంప్రదించాలని ఇవాళ కోరారు.
ఆంధ్రప్రదేశ్
రైలు కింద పడి వృద్ధురాలి మృతి


