హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో ‘ప్రజా దర్బార్’

BPT: ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మాలకొండయ్య ప్రజల నుంచి స్వయంగా 28 వినతిపత్రాలను స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, నిర్మాణాల కోసం 13 అర్జీలు, ఇతర సమస్యలపై 15 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వీటిని త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.