KDP: లింగాల మండలం మురారి చింతలకు చెందిన అంకె రాజు హత్య కేసులో నిందితులు సుధీర్, దిలీప్‌ను అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. భార్యను అనుమానంతో వేధిస్తున్న సుధీర్‌ను అడ్డుకునేందుకు మామ రాజు ఆమెను పుట్టింటికి తీసుకొచ్చారు. దీంతో కక్ష పెంచుకున్న సుధీర్ తన స్నేహితుడు దిలీప్‌తో కలిసి రాజును హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మామ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్


