హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత సుస్మిత కొణిదల శనివారం దర్శించుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆలయానికి వచ్చిన ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.