హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

NLR: దగదర్తి మండలం దామవరం పంచాయతీ నారాయణపురంలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.10 లక్షలతో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. టీడీపీ నేత అశోక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆమెకు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. పనులు త్వరగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.